భారతదేశం, జూలై 16 -- మలయాళ నటుడు, రాజకీయ నాయకుడు సురేష్ గోపి తన రాబోయే చిత్రం జానకి వి Vs స్టేట్ తో వెండితెరపైకి దూసుకురాబోతున్నారు. ఇది జూలై 17, 2025న థియేటర్లలో విడుదల అవుతుంది. అనుపమ పరమేశ్వరన్ కూడా నటించిన ఈ చిత్రం ఒక ఉత్కంఠభరితమైన కోర్టు గది డ్రామా థ్రిల్లర్ గా ఉండేలా కనిపిస్తుంది. దిగ్గజ నటుడు సురేష్ గోపీ గతంలోనూ కోర్టు థ్రిల్లర్ మూవీస్ చేశారు. ఓటీటీ ప్లే ప్రీమియంలో ఆయన నటించిన ఈ మలయాళ సినిమాల లిస్ట్ పై ఓ లుక్కేయండి.

ఈ చిత్రం 'ఎల్కే అంటే లైసెన్స్ టు కిల్' అని ప్రకటించిన ఆవేశపూరిత న్యాయవాది లాల్ కృష్ణ చుట్టూ తిరుగుతుంది. అతను కోర్టులో నేరస్థులను సమర్థిస్తాడు. వారిని నిర్దోషులుగా కూడా చేస్తాడు. కానీ కోర్టు బయట వాళ్లకు శిక్షలు విధిస్తూ న్యాయం చేస్తాడు. మరి చింతామణి హత్య కేసును అతను చేపట్టినప్పుడు ఏమి జరుగుతుంది? ప్రముఖ నటుడు తిలకన్‌తో...