Telangana, మే 23 -- తెలంగాణ పాలిసెట్ ఫలితాల విడుదలకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఇప్పటికే ప్రాథమిక కీలను ప్రకటించిన అధికారులు. అభ్యంతరాలను కూడా స్వీకరించారు. ఈ నేపథ్యంలో రేపు (మే 24) ఉదయం 11 గంటలకు రిజల్ట్స్ ను విడుదల చేయనున్నారు.

మే 13వ తేదీన తెలంగాణ పాలిసెట్ - 2025 పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 276 కేంద్రాల్లో నిర్వహించారు. ఈ ఏడాది 1,06,716 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హత పొందిన వారు. పాలిటెక్నిక్‌ కాలేజీల్లోని ఇంజనీరింగ్‌, నాన్ ఇంజనీరింగ్‌, టెక్నాలజీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందుతారు.

తెలంగాణ పాలిసెట్ - 2025 ఫలితాలను ప్రకటించిన తర్వాత. కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటిస్తారు. పాలిటెక్నిక్‌ కోర్సుల్లో మొత్తం కన్వీనర్ కోటా సీట్లే ఉంటాయి. ఇందులో 85 శాతం స్థానికులకు మిగిలిన 15 శాతం సీట్లను స్థానికేతర కోటా కింద కేటాయిస్తారు. విడతల...