భారతదేశం, నవంబర్ 16 -- ఈనెల 17వ తేదీన తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. ఇందులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించనుంది. బీసీ రిజర్వేషన్ల అమలు, హైకోర్టు తీర్పుతో పాటు మిగతా అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడో జరగాల్సి ఉంది. కానీ బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం చాలా రోజులుగా కసరత్తు చేస్తోంది. అసెంబ్లీలో తీర్మానం చేయటంతో పాటు ప్రత్యేకంగా జీవోను కూడా జారీ చేసింది. అయితే సర్కార్ తీసుకొచ్చిన జీవోపై కోర్టులు స్టే ఇవ్వటంతో 42 శాతం రిజర్వేషన్లపై సందిగ్ధత నెలకొంది. అప్పట్నుంచి ఎన్నికల నిర్వహణ పెండింగ్ లోనే ఉండిపోయింది.

రిజర్వేషన్ల పరిమితిపై స్పష్టమైన కోర్టు తీర్పులు ఉండటంతో. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వపరంగా అమలు చేయటం ...