Telangana,hyderabad, జూన్ 15 -- తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. సోమవారం(జూన్ 16) మధ్యాహ్నం 12 గంటలకు రిజల్ట్స్ అందుబాటులోకి వస్తాయి. ఈ ఫలితాలను https://tgbie.cag.gov.in లేదా http://results.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

మే 22 నుంచి 29 వరకు తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం 4.2 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. వీరంతా కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. మూల్యాంకనంతో పాటు సాంకేతిక అంశాల పరిశీలన పూర్తి కావటంతో. సోమవారం ఫలితాలను ప్రకటించనున్నారు.

మరోవైపు రాష్ట్రంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించి ప్రకటన వెలువడనుంది. ఇప్పటికే ఈఏపీసెట్ ఫలితాలు విడుదల కాగా.కౌన్సెలింగ్ కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నా...