భారతదేశం, మే 10 -- శ్రీసత్యసాయి జిల్లాలో రేపు జవాన్‌ మురళీనాయక్‌ అంత్యక్రియలు జరగనున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌, ఇతర నేతలు అంత్యక్రియలకు హాజరుకానున్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే వీడియో కాల్‌లో మురళీనాయక్‌ తల్లిదండ్రులను పరామర్శించారు. కల్లితండాలో మురళీనాయక్‌ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీఐపీల రాకతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు జిల్లా పోలీసులు.

మురళీనాయక్‌కు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు నివాళులు అర్పించారు. మురళీనాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ.. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జీ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. యుద్ధంలో ముర‌ళీ నాయ‌క్ చూపించిన తెగువ...