భారతదేశం, మే 19 -- ఏపీలో రానున్న రెండు రోజులు రాయలసీమలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. మరోవైపు కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 38డిగ్రీల నుంచి 40డిగ్రీల మధ్య నమోదయ్యేందుకు అవకాశం ఉంది.

రాయలసీమలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. గంటకు 50-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. పిడుగులతో కూడిన భారీ వర్షాలు నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

రానున్న మూడు రోజులు వాతావరణం క్రింది విధంగా ఉంటుంది.

తిరుపతి,చిత్తూరు, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, శ్రీసత్యసాయి, అనంతపురం,కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు క...