భారతదేశం, డిసెంబర్ 28 -- నదీ జలాల సమస్యలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది. స్వయంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా రంగంలోకి దిగే దిశగా కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ సభలను నిర్వహించే యోచనలో కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా సాగే అవకాశం ఉంది.

నీటి హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ ఇటీవల ఆందోళన చేస్తున్నట్లు ప్రకటించగా. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీని అసెంబ్లీలో చర్చ చేద్దామని ప్రతి సవాల్ కూడా చేసింది. అయితే ఈసారి జరగబోయే సమావేశాల్లో నీటి హక్కుల అంశంపై ప్రధానంగా చర్చ జరగొచ్చు.

గత రెండేళ్లుగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు ఇటీవల విలేకరుల సమావేశంలో మాట...