భారతదేశం, జనవరి 1 -- రీసర్వే పూర్తయిన గ్రామాల్లో కొత్త పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. శుక్రవారం(జనవరి 2) నుంచి ఈ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది. జనవరి 2 నుంచి 9 వరకు రెవెన్యూ గ్రామసభలు నిర్వహించి. రైతులకు నూతన పాస్ బుక్ లను పంపిణీ చేస్తారు.

గతంలో ఇచ్చిన పట్టాదారు పుస్తకాలపై జగన్ ఫొటోలున్నాయి. అయితే తాజాగా ఇవ్వబోయే పట్టాదారు పాస్ పుస్తకాలపై ఎలాంటి ఫొటోలు ఉండవు. కేవలం రాజముద్ర, క్యూఆర్‌ కోడ్‌తో కొత్త పుస్తకాలను మాత్రమే పంపిణీ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే పూర్తి అయిన గ్రామాల్లో.. మొత్తం 21.80 లక్షల పుస్తకాల పంపిణీకి రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టింది.

గతంలో ఇచ్చిన 21.86 లక్షల భూహక్కు పత్రాల స్థానంలో రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు(పీపీబీ) పంపిణీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. వీటిపై ఎవరూ ఫొటోలు ఉం...