భారతదేశం, మే 14 -- జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా కాళేశ్వరంలో మే 15న ప్రారంభం కానున్న సరస్వతి పుష్కరాల సందర్భంగా త్రివేణి సంగమం వద్ద సరస్వతి ఘాట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఈ పుష్కర ఘాట్ ప్రారంభం అనంతరం, కాళేశ్వర త్రివేణీ సంగమంలో ముఖ్యమంత్రి పుణ్యస్నానం ఆచరిస్తారు.

ముఖ్యమంత్రితోపాటు పలువురు మంత్రులు కూడా ఈ పుష్కరాలలో పాల్గొంటారు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అరుదైన సరస్వతి మహా పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. రేపు(15 న) ఉదయం 5 .44 గంటలకు తొగుట ఆశ్రమం పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ సంకల్పంతో పాటు పుష్కర స్నానం ఆరంభిస్తారు.

ప్రతీ రోజూ ఉదయం 8 .30 గంటల నుండి 11 గంటల వరకు యాగాలు నిర్వహిస్తారు. ప్రతీ రోజూ సరస్వతి ఘాట్ లో 6 .45 నుండి 7 .35 గంటల వరకు సరస్వతి ఘాట్ లో ప్రత్యేక సరస్వతి నవరత్న మాలహారత...