భారతదేశం, ఏప్రిల్ 30 -- కస్టమర్లు అప్రమత్తంగా ఉండండి! మీ ఏటీఎం లావాదేవీ ఛార్జీలు మే 1 నుండి పెరగనున్నాయి. బ్యాంకులు నెలవారీ పరిమితికి మించిన అన్ని లావాదేవీలపై ఈ ఛార్జీల భారం పడుతుంది. ఉచిత వినియోగానికి మించిన లావాదేవీలకు ఏటీఎం ఉపసంహరణ ఛార్జీలను పెంచడానికి బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే అనుమతినిచ్చింది. ''ఉచిత ట్రాన్సాక్షన్లకు మించి ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.23 ఫీజు వసూలు చేయవచ్చు. ఇది మే 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది'' అని ఆర్బీఐ మార్చి 28న జారీ చేసిన సర్క్యులర్లో పేర్కొంది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, అధీకృత ఏటీఎం నెట్ వర్క్ ఆపరేటర్లు, కార్డు చెల్లింపు నెట్ వర్క్ ఆపరేటర్లు, వైట్-లేబుల్ ఏటీఎం ఆపరేటర్లతో సహా అన్ని వాణిజ్య బ్యాంకులకు ఈ ఆర్బిఐ సర్క్యులర్ వర్తిస్తుంది.

నెలవారీ ఉచిత వినియోగానికి మించి బ్...