Hyderabad, అక్టోబర్ 8 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం సహజమే. త్వరలో రెండు గ్రహాల సంయోగం ఏర్పడబోతోంది. ప్రస్తుతం సింహ రాశిలో కేతువు, శుక్రుడు సంయోగం చెంది ఉన్నారు. జ్యోతిష లెక్కల ప్రకారం శుక్రుడు సెప్టెంబర్ 15న సింహ రాశిలోకి వచ్చాడు. కేతువు సింహ రాశిలో మే 29 నుంచి ఉంటున్నాడు. ఈ ఏడాది చివరి వరకు అదే రాశిలో కొనసాగిస్తాడు.

దీపావళికి ముందు అక్టోబర్ 9న శుక్రుడు సింహ రాశి నుంచి కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో శుక్ర-కేతువుల సంయోగం ఏర్పడబోతోంది. ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 20న వస్తుంది. దీపావళికి ముందు ఈ రెండు గ్రహాల సంయోగం చెందడంతో ద్వాదశ రాశుల వారిపై ప్రభావం పడుతుంది.

కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు. ఈ రాశుల వారికి మాత్రం శుక్ర-కేతువుల సంయోగం బాగ...