Andhrapradesh,tirupati, జూన్ 18 -- తిరుప‌తిలోని రేణిగుంట విమానాశ్ర‌యానికి శ్రీ‌వేంక‌టేశ్వ‌ర అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంగా పేరు మార్చ‌ాలనే ప్రతిపాదనను టీటీడీ తెరపైకి తీసుకువచ్చింది. ఇదే విషయాన్ని కేంద్ర విమాన‌యానశాఖ‌కు సిఫార్సు చేస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.

తిరుమ‌ల‌లోని టీటీడీ చైర్మ‌న్ క్యాంపు కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం టీటీడీ ధ‌ర్మ క‌ర్త‌ల మండ‌లి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

*⁠ ⁠ఇటీవ‌ల క‌ర్ణాట‌క సీఎం, డిప్యూటీ సీఎంల‌ను క‌లిసిన సంద‌ర్భంగా వారి అభ్య‌ర్థ‌న మేర‌కు బెంగుళూరులోని ప్ర‌ధాన ప్రాంతంలో శ్రీ‌వారి ఆల‌యం నిర్మించాల‌ని నిర్ణ‌యం. ఇందుకు కావాల్సిన 47 ఎక‌రాల స్థ‌లాన్ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం కేటాయించ‌గానే ఆల‌యం నిర్మించేందుకు చ‌ర్య‌లు.

*⁠ ⁠కేంద్ర భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీ హెచ్‌.డీ.క...