భారతదేశం, అక్టోబర్ 26 -- భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ మునుపెన్నడూ లేనంత వేగంగా ముందుకు దూసుకెళుతోంది! ముఖ్యంగా ఈ 2025.. అఫార్డిబుల్​ ఈవీలకు ఒక కీలకమైన సంవత్సరంగా మారింది. ప్రధాన ఆటోమొబైల్ తయారీదారులు అద్భుతమైన ధరల్లో, అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఎలక్ట్రిక్ మోడళ్లను విడుదల చేయడం వల్ల పర్యావరణ అనుకూల వాహనాలను కొనుగోలు చేయడానికి ఇప్పుడు తక్కువ ఖర్చు అవుతోంది.

మీరు రూ. 20 లక్షల లోపు ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్నట్లయితే, దేశంలో ఉన్న టాప్​ 5 ఆప్షన్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

1. టాటా పంచ్ ఈవీ - అత్యంత చౌకైన అర్బన్ ఈవీ

ధర: రూ. 9.99 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) రేంజ్ (అంచనా): 290 కి.మీ వరకు

తక్కువ ధరలో అద్భుతమైన ఎలక్ట్రిక్ వాహనాలను అందించడంలో టాటా మోటార్స్ నైపుణ్యం సాధించింది! దీనికి టాటా పంచ్ ఈవీ ఒక ఉదాహరణ. ఈ పంచ్​ ఈవీ అత్యంత విజయవంతమైన...