భారతదేశం, నవంబర్ 6 -- మిషన్ కాకతీయ ప్రాజెక్టులో ప్రైవేట్ పట్టా భూములను సరైన ప్రక్రియ లేకుండా చేర్చినందుకు తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం, రెవెన్యూ అధికారులను మందలించింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవిమల్లాల గ్రామానికి చెందిన బోనం సంజీవ రెడ్డి అనే రైతు, మరో ఏడుగురు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించింది.

పిటిషనర్లు పేర్కొన్న సర్వే నంబర్‌ 29 పూర్తిగా చెరువు మధ్యలో ఉందని, చెరువు మధ్యలో పట్టాలు ఎలా ఇస్తారు అని హైకోర్టు ప్రశ్నించింది. రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటున్నారని పేర్కొంది. రాష్ట్రంలో ఎఫ్‌టీఎల్ నిర్ణయించని కారణంగానే ఈ సమస్యలు వస్తున్నాయని పేర్కొంది. ప్రకృతి వైపరీత్యాలకు మానవులే బాధ్యులు, దీనికి ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని...