భారతదేశం, నవంబర్ 6 -- ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. గురువారం(నవంబర్ 6) కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) ప్రకారం, ఇతర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కూడా ఉండవచ్చు.

నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా వర్షాలు కురుస్తాయని, ఇది రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతాలపై వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేస్తుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖార్ జైన్ తెలిపారు.

వచ్చే వారంలో ఇది తుపానుగా మారుతుందా అనే ప్రశ్నలకు సమాధానమిస్తూ, అలాంటి అవకాశం లేదని విప...