భారతదేశం, ఫిబ్రవరి 5 -- రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. దీంతో జియోహాట్‌స్టార్ గంట గంటకూ ఓ పోస్ట్ తో సోషల్ మీడియాలో మూవీ హైప్ ను పెంచేస్తోంది. థియేటర్లలో దారుణంగా బోల్తా పడినా ఈ మూవీ కోసం ఓటీటీ ప్రేక్షకులు మాత్రం ఎంతలా ఎదురు చూస్తున్నారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.

సంక్రాంతి సందర్భంగా భారీ అంచనాల మధ్య రిలీజై బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడిన ప్రభాస్ హారర్ కామెడీ మూవీ ది రాజా సాబ్. జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కాగా నెల రోజుల్లోపే అంటే శుక్రవారం (ఫిబ్రవరి 6) నుంచి ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ప్రభాస్ రేంజ్, సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో చాలా త్వరగానే డిజిటల్ ప్రీమియర్ అవుతుందని చెప్పొచ్చు.

దీంతో సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృత మరింత పెరిగిపోయింది. ఎంతలా అంటే మూవీ కోసం జియోహాట్‌స్టార్ ఏర...