భారతదేశం, ఏప్రిల్ 29 -- డస్టర్ ఎస్ యూవీలో రాబోయే ఏడు సీట్ల వెర్షన్ పేరును రెనాల్ట్ ధృవీకరించింది. రెనాల్ట్ డస్టర్ 7 సీటర్ ఎస్ యూవీకి రెనాల్ట్ బోరియల్ అని నామకరణం చేయనున్నట్లు తెలిపింది. ఈ ఎస్ యూవీ యూరప్ మినహా, అంతర్జాతీయ మార్కెట్లో ఈ పేరుతోనే ఉంటుందని పేర్కొంది. అంటే, ఇండియాలో కూడా ఈ 7 సీటర్ డస్టర్ కు బోరియల్ అని పేరు కొనసాగుతుంది.

రెనాల్ట్ కొత్త తరం డస్టర్ ఎస్ యూవీని 2026 మధ్యలో భారత మార్కెట్లో విడుదల చేయనుంది. డస్టర్ ఒకప్పుడు భారత్ లో అత్యధికంగా అమ్ముడుపోయిన మోడల్. ఆ తరువాత క్రమంగా అది భారత మార్కెట్ నుంచి తొలగిపోయింది. ఇప్పుడు మళ్లీ కొత్త ఫీచర్లతో పునారగమనం చెందుతోంది. కొత్తగా ఏడు సీట్ల వేరయింట్ ను కూడా తీసుకువస్తున్నారు. డస్టర్ 7 సీటర్ వేరియంట్ లేదా బోరియల్ 2027 లో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

రెనాల్ట్ బోరియల్ త్వరలో అంతర్జాత...