భారతదేశం, జనవరి 10 -- భారతీయ ఆటోమొబైల్ మార్కె్ట్​లో తన పట్టును మరింత పెంచుకోవాలని రెనాల్ట్​ గట్టి ప్లాన్ వేస్తోంది. ఇందులో భాగంగానే తన సెకండ్ ఇన్నింగ్స్‌ను సరికొత్తగా ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. జనవరి 26న తన పాపులర్ మోడల్ 'డస్టర్' ఎస్​యూవీని సరికొత్త రూపంలో భారత్‌కు పరిచయం చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇదిలా ఉండగా, తాజాగా ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఎలాంటి ముసుగులు లేకుండా, మెరిసిపోతున్న 'రెనాల్ట్​ రఫేల్' కారు భారత రోడ్లపై దర్శనమిచ్చింది.

ప్రస్తుతానికి ఈ కూప్​-ఎస్​యూవీ భారత్‌లో అధికారికంగా లాంచ్ చేస్తామని కంపెనీ చెప్పకపోయినప్పటికీ, ఇది ఇండియన్ రోడ్లపై కనిపించడం చూస్తుంటే భవిష్యత్తులో ఈ కారు ఎంట్రీ ఖాయమనిపిస్తోంది. బహుశా ఏదైనా ఈవెంట్‌లో ప్రదర్శించడానికో లేదా టెస్టింగ్ కోసమో దీనిని తీసుకొచ్చి ఉండవచ్చు.

సీఎంఎఫ్-సీ/డీ ప్...