భారతదేశం, డిసెంబర్ 22 -- భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది జపాన్ దిగ్గజం నిస్సాన్. ఇందులో భాగంగా మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని, రెనాల్ట్​ ట్రైబర్​ ఆధారిత, సరికొత్త కాంపాక్ట్ ఎంపీవీ 'గ్రావిటే'ని పరిచయం చేయబోతోంది. 2026 మార్చి నాటికి ఈ కారు షోరూమ్‌లలో సందడి చేసే అవకాశం ఉంది. మరి ఇది కేవలం రెనాల్ట్​ ట్రైబర్​కి రీబ్యాడ్జ్​ వర్షెన్​గా మిగిలిపోతుందా? లేదా ఇందులో కొత్తగా ఏమైనా ఉంటాయా?

వచ్చే ఏడాది జనవరి 21న 'గ్రావిటే' ఎంపీవీని ప్రపంచానికి అధికారికంగా పరిచయం చేయనుంది నిస్సాన్. ఈ ఎంపీవీ తర్వాత 2026 మధ్యలో 'టెక్టాన్' ఎస్‌యూవీని, ఆపై 2027లో మరో భారీ 7-సీటర్ ఎస్‌యూవీని తీసుకురావాలని కంపెనీ పక్కా ప్రణాళికతో ఉంది.

ఈ నేపథ్యంలో ఇటీవలే విడుదల చేసిన గ్రావిటే టీజర్లు.. ఈ ఎంపీవీపై ఆసక్తిని పెంచుతున్నాయి.

కొత్త ఎంప...