భారతదేశం, మే 25 -- కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 ముగింపు వేడుకకు హాజరైన అలియా భట్ అందరి చూపు తనపైనే ఉండేలా చూసుకుంది. ఫెస్టివల్ చివరి రోజున రెడ్ కార్పెట్ పై చీరకట్టులో తళుక్కమని మెరిసింది అలియా. క్లోజింగ్ సెరెమనీలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఈ భామ. అలియా.. లోరియల్ బ్రాండ్ అంబాసిడర్లలో ఒకరిగా ఉంది.

భారత సంస్కృతి సంప్ర‌దాయాల‌ను చాటడంతో పాటు చీరకు కాస్త మోడ్రన్ టచ్ కూడా ఇచ్చింది అలియా భట్. రెడ్ కార్పెట్ పై చీరకట్టులో అలియా ఫొటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. నో-ప్లెప్ట్ చీర లుక్ తో పాటు అందుకు సరిపోయే నెక్ లైన్ బ్లౌజ్ తో అదరగొట్టింది అలియా. చీరకట్టులో క్యూట్ లుక్స్ తో అలరించింది భామ.

ఈ ఏడాదే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో డెబ్యూ చేసింది అలియా భట్. మే 23న మాస్టర్ మైండ్ ప్రీమియర్ షోకు ఆమె అటెండ్ అయింది. అప్పుడు లేత గోధుమ రంగు షియాపరెల్లి గౌన్ ...