Hyderabad, మే 2 -- రెట్రో రెండో రోజు బాక్సాఫీస్ కలెక్షన్: సూర్య నటించిన రెట్రో మూవీ బాక్సాఫీస్ వసూళ్లు దారుణంగా ఉన్నాయి. తొలి రోజు ఊహించినదాని కంటే చాలా చాలా తక్కువ వసూళ్లు సాధించిన ఆ మూవీ.. రెండో రోజు మరింత పతనమైంది. సూర్య నటనకు మంచి మార్కులే పడినా.. ఓవరాల్ గా మూవీకి మాత్రం నెగటివ్ రివ్యూలే వచ్చాయి.

సూర్య, పూజా హెగ్డే నటించిన రెట్రో మూవీ ముందస్తు అంచనాల ప్రకారం.. రెండో రోజు కేవలం రూ.4.98 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు Sacnilk.com వెల్లడించింది. తొలి రోజు రూ.19.25 కోట్లు వసూలు చేయగా.. రెండో రోజు సగానికి సగం తగ్గిపోయాయి. రెండు రోజులు కలిపి ఈ సినిమా కేవలం రూ.24.23 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

శుక్రవారం (మే 2) తమిళంలో రెట్రో ఆక్యుపెన్సీ కూడా 35.9 శాతంగా మాత్రమే ఉంది. దీనిని బట్టి ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తోందో అర్థం చేసుకోవచ్చు. మర...