Hyderabad, జూలై 31 -- జీ5 ఓటీటీ ఎప్పుడూ కూడా డిఫరెంట్ కంటెంట్, విభిన్న చిత్రాల్ని, సిరీస్‌లను అందిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఇక తాజాగా తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన 'సత్తముమ్ నీతియుమ్' సినిమాను ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లోకి తీసుకురానున్నారు.

ఇదివరకే జూలై 18 నుంచి జీ5లో తమిళ వెర్షన్‌లో సత్తముమ్ నీతియుమ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లో సత్తముమ్ నీతియుమ్ వెబ్ సిరీస్‌ను ఓటీటీ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని రీసెంట్‌గా మేకర్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా నటుడు శరవణన్ మాట్లాడుతూ .. "సత్తముమ్ నీతియుమ్ కథ విన్న వెంటనే అది నా మనసును తాకింది. ఇది రెగ్యులర్ కోర్ట్ డ్రామా కాదు. ఈ కథ సామాన్యుడి బలం గురించి మాట్లాడుతుంది. ధైర్యంగా నిలబడి పోరాడే ఓ కామన్ మెన్‌ను చూపిస్తుంది" అని చెప్పారు.

"ఇలాంటి ప్రాజెక్టులో నే...