భారతదేశం, జనవరి 11 -- పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ హారర్ కామెడీ 'ది రాజా సాబ్' బాక్సాఫీస్ జర్నీ పడుతూ లేస్తూ సాగుతోంది. మారుతి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా.. ప్రభాస్ కెరీర్‌లోని భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల సరసన నిలవలేకపోయింది. అయినప్పటికీ ఇండియాలో రూ. 100 కోట్ల నెట్ వసూళ్ల మైలురాయికి చేరువలో ఉంది.

ప్రముఖ ఇండస్ట్రీ ట్రాకర్ 'సాక్నిల్క్' (Sacnilk) రిపోర్టు ప్రకారం.. రెండో రోజు (శనివారం) 'రాజా సాబ్' ఇండియాలో రూ. 27.83 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. తొలి రోజుతో పోలిస్తే ఇది దాదాపు 48.22% తక్కువ. అంటే కలెక్షన్స్ సగానికి పడిపోయాయి.

తెలుగు: రూ. 22.38 కోట్లు

హిందీ: రూ. 5.2 కోట్లు

తమిళం: రూ. 0.15 కోట్లు

జనవరి 9న విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ నడుమ తొలి రోజు రూ. 53.75 కోట్లు రాబట్టిన విషయం తెలిసిందే. రెండు రోజులు కలిపి ఇండియాలో ఈ ...