భారతదేశం, నవంబర్ 30 -- తమిళ స్టార్ హీరో ధనుష్, హిందీ ముద్దుగుమ్మ కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా చిత్రం తేరే ఇష్క్ మే. లవ్ సినిమాలకు పెట్టింది పేరు అయిన ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 28న థియేటర్లలో విడుదల అయింది.

ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీగా తేరే ఇష్క్ మే మంచి రివ్యూలను అందుకుంటోంది. హాలీడే కాకున్నా తొలి రోజు శుక్రవారం స్ట్రాంగ్ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది ఈ మూవీ. విడుదలైన రెండవ రోజున ఈ చిత్రం అలాగే దూకుడు కొనసాగించిందా? ఇప్పటి వరకు తేరే ఇష్క్ మే బాక్సాఫీస్ కలెక్షన్స్‌ను వివరంగా చూద్దాం.

తేరే ఇష్క్ మే సినిమాకు ఇండియాలో తొలి రోజున రూ. 16 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. వాటిలో హిందీ నుంచి రూ. 15.25 కోట్ల కలెక్షన్స్ ఉంటే తమిళం ద్వారా కేవలం 75 లక్షలు మాత్రమే ఉన్నాయి. అంటే ధనుష్ సొంత సినీ ఇండస్ట...