Hyderabad, జూన్ 22 -- డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ కుబేర. నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా, జిమ్ సర్బ్ నటించిన కుబేర మూవీ జూన్ 20న థియేటర్లలో విడుదలై అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో కుబేర కలెక్షన్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి.

కుబేర మూవీకి తొలిరోజు వరల్డ్ వైడ్‌గా రూ. 30 కోట్ల గ్రాస్ వచ్చినట్లు సోషల్ మీడియాలో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలాగే, కేవలం ఇండియాలో ఓపెనింగ్ డే నాడు కుబేర మూవీకి రూ. 14.75 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ సంస్థ సక్నిల్క్ తెలిపింది.

ఈ 14.75 కోట్లలో తెలుగు నుంచి రూ. 10 కోట్లు, తమిళం ద్వారా రూ. 4.5 కోట్లు, కన్నడ వెర్షన్‌కు రూ. 2 లక్షలు, హిందీ బెల్ట్‌లో రూ. 23 లక్షలు నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది కుబేర. అలాగే, ఓవర్సీస్ నుంచి ఓపెనింగ్ డే నాడు ఈ సినిమాకు రూ. ...