Hyderabad, ఆగస్టు 2 -- రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా జూలై 31న థియేటర్లలో విడుదలై మంచి కలెక్షన్స్ రాబడుతోంది. మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా సత్తా చాటుతోంది. విజయ్ ఇటీవల నటించిన ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే కింగ్డమ్‌కు డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి.

కింగ్డమ్ సినిమాకు ఇండియాలో తొలి రోజు రూ. 18 కోట్ల నెట్ కలెక్షన్స్ రాగా రెండో రోజు అయిన శుక్రవారం (ఆగస్ట్ 1) నాడు 7.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సక్నిల్క్ సంస్థ వెల్లడించింది. అలాగే, రెండు రోజుల్లో భారతదేశంలో కింగ్డమ్ సినిమాకు రూ. 25.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు పేర్కొంది.

అయితే, మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు కింగ్డమ్ సినిమా కలెక్షన్స్ పడిపోయాయి. ఇక రెండో రోజున తెలుగు రాష్ట్రాల్లో కింగ్డమ్ సినిమాకు 42.56 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. మరో...