భారతదేశం, నవంబర్ 2 -- బాహుబలి ది ఎపిక్ 2 రోజుల కలెక్షన్స్: ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి ది ఎపిక్ సినిమా బాక్సాఫీస్ వద్ద హాట్ టాపిక్‌గా మారింది. బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కంక్లూజన్ వంటి రెండు బ్లాక్ బస్టర్లను ఒకే సినిమాగా బాహుబలి ది ఎపిక్ టైటిల్‌తో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన బాహుబలి ది ఎపిక్ మూవీకి ఓపెనింగ్ కలెక్షన్స్ అదిరిపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌తో కలిపి తొలిరోజున రూ. 10.8 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ వచ్చాయి. వీటిలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ. 1.15 కోట్లు వచ్చాయి.

అలాగే, మొదటి రోజున వచ్చిన రూ. 9.65 కోట్ల నెట్ కలెక్షన్స్‌లలో తెలుగు నుంచి రూ. 7.9 కోట్లు, హిందీ బెల్ట్ ద్వారా రూ. 1.35 కోట్లు, కన్నడ నుంచి 2 లక్షలు, మలయాళం నుంచి 18 లక్షలు, తమిళంలో 2 లక్షల వ...