Hyderabad, జూన్ 2 -- థియేటర్లలో సినిమాలకు ఎలాంటి రెస్పాన్స్ ఉన్నా ఓటీటీల్లో మాత్రం అదిరిపోయే ఆదరణ ఉంటుంది. థియేటర్లలో మంచి ఆదరణకు గురి కాని ఎన్నో సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో మాత్రం హిట్ చేస్తుంటారు ఆడియెన్స్. ఇక చిన్న సినిమాలు ఎంతో ప్రభావం చూపించిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి.

అలాంటి వాటిలోకి మరో చిన్న సినిమా చేరింది. ఆ మూవీనే టుక్ టుక్. తెలుగులో హారర్ కామెడీ మూవీగా వచ్చింది ఈ సినిమా. మార్చి 21న థియేటర్లలో విడుదలైన టుక్ టుక్ సినిమాకు రెస్పాన్స్ పర్వాలేదనిపించుకుంది.అయితే, కాన్సెప్ట్ బాగున్నప్పటికీ పలు కారణాల వల్ల ఆశించిన స్థాయిలో టుక్ టుక్ సరైన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

ఇక థియేట్రికల్ రిలీజ్‌ అయిన 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది టుక్ టుక్. ఏప్రిల్ 10 నుంచి ఈటీవీ విన్‌లో టుక్ టుక్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈటీవీ విన్ ఓటీ...