భారతదేశం, మే 4 -- తెలుగు స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవలే పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు నేడు (మే 4) పౌర సన్మాన సభ జరిగింది. హిందూపురంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాలకృష్ణ సుదీర్ఘంగా మాట్లాడారు. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలైదంటూ మాట్లాడారు.

ఇక నుంచి తాను చేసే సినిమాలు అందరి ఊహలకు, అంచనాలకు మించి ఉంటాయని బాలకృష్ణ అన్నారు. " వరుసగా నాలుగు హిట్లు ఇచ్చిన తర్వాత నా రెండో ఇన్నింగ్స్ మొదలైందని చెబుతున్నా. ఇప్పుడు చూపిస్తా. ఇక ముందు ఎలాంటి సినిమాలు చేస్తానో మీ ఊహలకు, అంచనాలకు కూడా అందవు. మీరు చూస్తారు" అని బాలకృష్ణ అన్నారు.

అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహరాజ్‍తో నాలుగేళ్లలో వరుస హిట్స్ సాధించారు బాలకృష్ణ. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 చ...