భారతదేశం, డిసెంబర్ 4 -- తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ బ్యూటిపుల్ హీరోయిన్ కృతి సనన్ మొదటిసారి జంటగా నటించిన రొమాంటిక్ ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ తేరే ఇష్క్ మే. నవంబర్ 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా రోజు రోజు వసూల్లు పెంచుకుంటూ పోయింది. మూడో రోజున తొలిసారిగా వసూల్లు పడిపోయాయి.

ఇప్పుడు తాజాగా రెండోసారి కూడా తేరే ఇష్క్ మే కలెక్షన్స్ పడిపోయాయి. విడుదలైన తొలి ఐదు రోజుల్లో భారతదేశంలో తేరే ఇష్క్ మే రూ. 71 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఆరో రోజు మాత్రం బాక్సాఫీస్ వద్ద కొద్దిగా పడిపోయింది. ఆరవ రోజున, ఈ బహుభాషా చిత్రం తేరే ఇష్క్ మే సినిమాకు ఇండియాలో రూ. 6.75 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి.

అయితే, అంతకుముందు ఐదో రోజున తేరే ఇష్క్ మే కలెక్షన్స్ ఇండియాలో రూ. 10.25 కోట్లుగా ఉన్నాయి. తేరే ఇష్క్ మే శుక్రవారం (నవంబర్ 28) రూ. 16 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్...