భారతదేశం, ఆగస్టు 21 -- బిల్లుల ఆమోదానికి సంబంధించిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక బిల్లును రాష్ట్ర అసెంబ్లీ రెండోసారి ఆమోదించి గవర్నర్‌కు పంపితే రాష్ట్రపతి పరిశీలనకు పంపలేరని సుప్రీంకోర్టు తెలిపింది. బిల్లుల ఆమోదానికి సంబంధించి గవర్నర్ అధికారాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయాలి లేదా ఆయన ఆమోదాన్ని నిలిపివేయవచ్చు లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపవచ్చు.

దీని ప్రకారం ద్రవ్యబిల్లు కాకపోతే బిల్లును పునఃపరిశీలన కోసం తిరిగి అసెంబ్లీకి పంపే హక్కు కూడా గవర్నర్ కు ఉంటుంది. రెండోసారి అసెంబ్లీ ఆమోదించిన తర్వాత కూడా బిల్లును రాష్ట్రపతికి పంపే అధికారం గవర్నర్ కు ఉందన్న కేంద్రం వైఖరి నేపథ్యంలో సీజేఐ ...