భారతదేశం, డిసెంబర్ 14 -- నందమూరి బాలకృష్ణ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'అఖండ 2: తాండవం' చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన ఇస్తోంది. తొలి రోజు అంచనాలకు మించిన వసూళ్లు సాధించిన ఈ చిత్రం రెండో రోజు (శనివారం) మాత్రం కాస్త నెమ్మదించింది. అయినా, కేవలం రెండు రోజుల్లోనే రూ. 50 కోట్ల క్లబ్‌కు చేరువ కావడం విశేషం.

ఇండస్ట్రీ ట్రాకర్ 'సక్నిల్క్' నివేదిక ప్రకారం 'అఖండ 2' భారతదేశంలో రెండో రోజున అంటే శనివారం (డిసెంబర్ 13) రూ. 15.50 కోట్ల నికర వసూళ్లను (నెట్ కలెక్షన్స్) సాధించింది.

తొలి రోజు వసూళ్లు: రూ 22.5 కోట్లు (నెట్)

రెండో రోజు వసూళ్లు: రూ. 15.50 కోట్లు (నెట్)

అంటే, తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు కలెక్షన్లలో సుమారు రూ. 7 కోట్ల తగ్గుదల నమోదైంది. ఇది దాదాపు 31.1% క్షీణత అని చెప్పాలి. ఇక అఖండ 2 విడుదలైన రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా మొత్త...