భారతదేశం, మే 13 -- వేములవాడ రాజరాజేశ్వర ఆలయ అభివృద్ధి పేరుతో జూన్ 15 నుండి రాజన్న ఆలయాన్ని మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రేపు(బుధవారం) వేములవాడ పట్టణ బంద్ కు రాజన్న ఆలయ రక్షక కమిటీ పిలుపునిచ్చింది. స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ తమ దుకాణాలను మూసివేయాలని కోరింది.

బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామక్రిష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సహా అన్ని పార్టీల నాయకులతో కలిసి 'రాజన్న ఆలయ రక్షక కమిటీ'ని ఏర్పాటు చేశారు. రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా రాబోయే రెండు సంవత్సరాలపాటు ఆలయాన్ని మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రాజన్న ఆలయ రక్షక కమిటీ నిరసనకు పిలుపునిచ్చింది.

కమిటీ ఛైర్మన్ ప్రతాప రామక్రిష్ణ మాట్లాడుతూ....ఆలయ అభివృద్ధి పేరుతో 2 ఏళ్లపాటు రాజన్న ఆలయాన్ని మూసివేయాలనుకోవడం దుర్మార్గమన్నారు...