Hyderabad, సెప్టెంబర్ 4 -- ఈ మధ్యే ఓటీటీలోకి వచ్చిన తమిళ కామెడీ థ్రిల్లర్ మూవీ మారీశన్ తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు అలాంటిదే మరో తమిళ కామెడీ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వస్తోంది. నిజానికి ఇప్పటికే ఓ ఓటీటీలో ఉన్న ఈ సినిమా.. రెండేళ్ల తర్వాత రెండో ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

ఈ తమిళ కామెడీ థ్రిల్లర్ మూవీ పేరు తందట్టి (Thandatti). ఈ సినిమా ఇప్పటికే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు సన్ నెక్ట్స్ ఓటీటీలోకి కూడా రానుంది. శుక్రవారం (సెప్టెంబర్ 5) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ ఓటీటీ తెలిపింది.

"ఓ తెలివైన కథ, లోతైన ఎమోషన్స్, మీరు ఊహించని ఓ ట్విస్ట్. తందట్టి రేపటి నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది" అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ఈ విషయం వెల్లడించింది.

తమిళ కామెడీ థ్రిల్లర్ మూవీ తందట్టి జూన్, 2023లో రిలీజ...