Hyderabad, జూలై 10 -- మలయాళం ఫ్యామిలీ డ్రామా సంతోషం (Santhosham) ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. ఐఎండీబీలో 6.7 రేటింగ్ సొంతం చేసుకున్న ఈ సినిమా రెండేళ్ల తర్వాత ఇప్పుడు తెలుగులోకి వచ్చింది. ఇప్పటికే మలయాళం వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. తాజాగా ఈటీవీ విన్ ఓటీటీ తెలుగులో స్ట్రీమింగ్ చేస్తోంది.

మలయాళం ఫ్యామిలీ డ్రామా సంతోషం 2023లో రిలీజైంది. అప్పట్లో ఈ సినిమాకు పాజిటివ్ నుంచి మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. దీంతో ఈ మూవీని రెండేళ్లకు ఇప్పుడు తెలుగులో తీసుకొచ్చారు. మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని ఈటీవీ విన్ ఓటీటీ గురువారం (జులై 10) వెల్లడించింది.

"సంతోషం (2023) ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమ, కుటుంబ విలువలు, గుండెను హత్తుకునే క్షణాలతో కూడిన ఓ ఎమోషనల్ రైడ్ ఇది. కేవలం ఈటీవీ విన్ ఓటీటీలో సంతోషం మూవీ చూడండి" అనే క్యా...