Hyderabad, మే 25 -- యాంకర్‌గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. పుష్ప 2, రజాకార్ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన ఈ మాజీ యాంకర్ నటించిన లేటెస్ట్ మూవీనే అరి. సైకో మైథలాజికల్ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో అనసూయతోపాటు సాయి కుమార్, శుభలేఖ సుధాకర్ వంటి ప్రముఖులు నటించారు.

పేపర్ బాయ్ మూవీతో పేరు తెచ్చుకున్న డైరెక్టర్ జయ శంకర్ అరి సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే, అరి సినిమా మొదలుపెట్టి రెండేళ్లకుపైగా అవుతోంది. రెండేళ్ల క్రితం అంటే 2023 మార్చిలో అరి టీజర్‌ను రిలీజ్ చేశారు. అరి టీజర్ చాలా బాగా ఆకట్టుకుంది. ఒక్కో పాత్ర ఒక్కో దురాశ గురించి చెబుతూ ఇంటెన్సివ్‌గా కనిపించింది.

దాంతో అరి మూవీ రిలీజ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. కానీ, అప్పటి నుంచి ఇప్పటివరకు అరి థియేట్రికల్ రిలీజ్‌కు నోచుకోలేదు. ఎన్న...