భారతదేశం, నవంబర్ 7 -- శర్వానంద్‌ను ఈ మధ్య బైకర్ మూవీ ప్రమోషన్లలో చూసిన అభిమానులు షాక్ తిన్నారు. అతడేంటి ఇంత సన్నగా ఎలా అయ్యాడని ఆశ్చర్యపోయారు. అయితే తాజాగా హైదరాబాద్ టైమ్స్ ఇంటర్వ్యూలో అతడు తన వెయిట్ లాస్ జర్నీ గురించి షేర్ చేసుకున్నాడు. 8 నెలల పాటు తాను ఎంతలా కష్టపడిందీ చెప్పాడు. ఒక్క యాక్సిడెంట్ మొత్తం మార్చేసిందని అన్నాడు.

బైకర్ మూవీ కోసం శర్వానంద్ పూర్తి బక్కపల్చగా మారిపోయిన సంగతి తెలుసు కదా. అయితే రెండేళ్ల కిందట 92 కిలోల బరువున్న అతడు.. దీనికోసం ఏకంగా 22 కిలోలు తగ్గడం విశేషం. అయితే అది ఎలా సాధ్యమైందన్నది తాజా ఇంటర్వ్యూలో అతడు చెప్పాడు. దానికి ఒక యాక్సిడెంట్ ఎలా కారణమైందీ వివరించాడు. "ఆ ప్రమాదం మొత్తం మార్చేసింది. నెలల పాటు యాంటీబయోటిక్స్ పై ఉన్నాను. చాలా ఆకలిగా అనిపించేది.

దీంతో తింటూ వెళ్తే బరువు పెరుగుతూ వెళ్లాను. చాలా రోజుల పాటు...