భారతదేశం, ఫిబ్రవరి 9 -- సచివాలయంలో మంత్రులు, పలు శాఖల కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్‌గా హాజరయ్యారు. జీఎస్‌డీపీ వృద్ధిరేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్‌ లక్ష్యాలు, పది సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలు, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పీపీపీ ప్రాజెక్టుల పురోగతి మీద చంద్రబాబు చర్చించారు. రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌లో భాగంగా సాంకేతికతతో పాటు అవేర్‌, డేటా లీక్‌, పాలనలో ఏఐ టూల్స్‌ వినియోగం, కేంద్ర ప్రాయోజిత పథకాల యాక్షన్‌ ప్లాన్‌, యువతకు నైపుణ్యాభివృద్ధి, వన్‌ ఫ్యామిలీ-వన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ విధానం మీద మాట్లాడారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను అట్టడుగు వర్గాలకు కూడా చేరవేయాలని చెప్పారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ల సదస్సులు నిర్వహించేవారు కాదని, ఇప్పుడు మూడు నెలలకోసార...