భారతదేశం, జూలై 10 -- ఒక తరం మొత్తానికి సంజీవ్ కుమార్ నటన దాదాపు మిస్టరీగానే మిగిలిపోయింది. రాజేష్ ఖన్నా, దిలీప్ కుమార్ వంటి తన సమకాలీనుల లాగా ఆయన పాపులర్ కాలేకపోయారు. కానీ తనదైన పాత్రలతో అలరించారు. ఆయన జీవితంతో జాతీయ అవార్డులు, హీరోయిన్లతో రిలేషన్ షిప్, హేమ మాలినితో ఆగిపోయిన పెళ్లి.. ఇలా ఎన్నో విషయాలున్నాయి. ఇప్పుడు సంజీవ్ కుమార్ పేరు ట్రెండింగ్ లో ఉండటానికి కారణం జూలై 9న ఆయన జయంతి కావడమే.

1938 జూలై 9న హరిహర్ జెథాలాల్ జరివాలాగా జన్మించిన సంజీవ్ కుమార్.. రెండు సార్లు జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచారు. దస్తక్ (1970), కోశిష్ (1972) సినిమాల్లో యాక్టింగ్ కు గాను ఈ అవార్డు సొంతం చేసుకున్నారు. అంతే కాకుండా షోలే, ఆంధీ, నమ్కీన్, అనామిక వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. అయితే ఆయన ఎంత ఫేమస్ అయ్యారో ఆయన జీవితంలో వివాదాలు అదే స్థాయిలో ఉన్నాయి....