భారతదేశం, జనవరి 2 -- ఇన్వెస్టర్లు సేఫ్​ బెట్​గా భావించే ఐటీసీ స్టాక్​లో భారీ కుదుపు! గురువారం ట్రేడింగ్​ సెషన్​లో 10శాతం పతనమై రూ. 50వేల కోట్ల మార్కెట్​ క్యాపిటల్​ని కోల్పోయిన ఈ ఎఫ్​ఎంసీజీ దిగ్గజం, శుక్రవారం కూడా నష్టాలను చూస్తోంది.

పొగాకు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించడంతో శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఐటీసీ షేర్లు ఒకానొక దశలో 5శాతానికి పైగా క్షీణించి, 52 వీక్​- లో అయిన రూ. 345.35ని టచ్​ చేశాయి. ఉదయం 11 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఈ సంస్థ షేర్లు దాదాపు 4శాతం నష్టాలతో రూ. 350 వద్ద ట్రేడ్​ అవుతున్నాయి.

గత ఏడాది కాలంలో ఐటీసీ షేరు సుమారు 25 శాతం మేర నష్టపోయింది. ఒక్క గత నెల రోజుల్లోనే ఈ స్టాక్ 13 శాతం మేర క్షీణించింది.

డిసెంబర్ 31న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. సిగరెట్...