భారతదేశం, జనవరి 14 -- 'భోళా శంకర్' పరాజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు' (MSVPG) సినిమాలో చిరు తన మార్క్ కామిక్ టైమింగ్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాడు. బాక్సాఫీస్ వద్ద బంపర్ ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా.. రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించింది.

ప్రముఖ ట్రేడ్ ట్రాకింగ్ సైట్ 'సాక్నిల్క్' (Sacnilk) నివేదిక ప్రకారం.. ఈ మన శంకరవరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ నంబర్స్ ఇలా ఉన్నాయి. మొదటి రోజు మొత్తంగా రూ. 32.25 కోట్లు, స్పెషల్ ప్రీవ్యూల ద్వారా రూ. 9.35 కోట్లు కలిపి వసూళ్లు రూ. 41.6 కోట్లుగా నమోదయ్యాయి. ఇక రెండో రోజు 19.50 కోట్లు వచ్చాయి. దీంతో కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ. 50 కోట్ల మార్క్ దాటేసి, ఇండియాలో రూ. 61.10 కోట...