భారతదేశం, నవంబర్ 17 -- మరో భారీ బడ్జెట్ మూవీ కూడా ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌కి అనుగుణంగా రెండు భాగాలుగా రానుంది. 'బాహుబలి' తరువాత వచ్చిన అనేక భారీ చిత్రాలు అనవసరంగా సీక్వెల్స్ ను తీసుకొస్తుండటంతో ప్రేక్షకులకు కూడా విసుగొస్తోంది. పుష్ప, కేజీఎఫ్ లాంటి మూవీస్ సీక్వెల్స్ మాత్రమే అంచనాలను అందుకోగా.. మిగిలినవాటిలో చాలా వరకు బోల్తా పడ్డాయి. ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న ఫౌజీని కూడా రెండు భాగాలుగా తీసుకురావడానికి కారణమేంటో డైరెక్టర్ హను రాఘవపూడి వెల్లడించాడు.

ప్రభాస్, ఇమాన్వీ జంటగా వస్తున్న మూవీ ఫౌజీ. దర్శకుడు హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ 'ఫౌజీ' మూవీ రెండు భాగాలుగా విడుదలవడం ఖాయమైంది. ఇందులో రెండవ భాగం ప్రిక్వెల్‌గా ఉంటుందని డైరెక్టర్ హను తెలిపాడు. రెండో భాగం ఇండియా వలస పాలన కాలం నాటి చరిత్రను, మరో కోణాన్ని అన్వేషిస్తుందని అతడు చెప్పాడు.

ప...