Hyderabad, సెప్టెంబర్ 4 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళుతూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 15న శుక్రుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడుతో పాటుగా అదే రోజు బుధుడు కూడా రాశి మార్పు చెందుతాడు.

బుధుడు కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకు వస్తుంది. మరి ఏ రాశుల వారు ఈ రెండు గ్రహాల సంచారం వలన లాభాలను పొందుతారు? ఎవరికి అలా కలిసి వస్తుంది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మిధున రాశి వారికి ఈ రెండు గ్రహాల సంచారంలో మార్పు శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. కెరీర్‌లో బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు ప్రమోషన్ పొందే అవకాశం కూడా ఉంది. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగు...