Hyderabad, జూలై 19 -- అలనాటి తెలుగు స్టార్ హీరోయిన్లలో బ్యూటిఫుల్ ఆమని ఒకరు. 90స్ కాలంలోని సినిమాల్లో ఎంతో హోమ్లీగా కనిపించిన ఆమని మిడిల్ క్లాస్‌ ఆడియెన్స్‌తోపాటు యూత్‌ను ఆకట్టుకున్నారు. మావి చిగురు, శుభలగ్నం, జంబలకిడి పంబ సినిమాల్లో ఆమని చేసిన పాత్రలను అంత ఈజీగా ఎవరు మర్చిపోలేరు.

స్టార్ హీరోయిన్‌గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఆమని ఇటీవల కాలంలోనే కీలక పాత్రలతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆమని చేసిన సినిమా నారి. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ ఆమని పాల్గొన్నారు.

ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆమని ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చారు. సమాజాంలో ఆడవాళ్లపై జరిగే ఆకృత్యాలు, వారు ఎదుర్కొనే మానసిక సంఘర్షణ, అబ్బాయిల కంటే ఆడవాళ్లను చులకనగా చూడటం వంటి అంశాల గురించి యాంకర్, ఆమని మాట్లాడుకున్నారు. ...