భారతదేశం, జూన్ 5 -- ఓటీటీలోకి డిఫరెంట్ కాన్సెప్ట్.. విభిన్నమైన జోనర్ సినిమాలు దూసుకొస్తూనే ఉన్నాయి. డిజిటల్ స్ట్రీమింగ్ తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ తెలుగు కామెడీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కోసం వచ్చేసింది ఈ మూవీ.

తెలుగు కామెడీ మూవీ 'పెళ్లి కాని ప్రసాద్' మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు (జూన్ 5) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అడుగుపెట్టింది ఈ సినిమా. మల్లీశ్వరి సినిమాలోని వెంకటేశ్ క్యారెక్టర్ పేరుతో వచ్చిన ఈ పెళ్లి కాని ప్రసాద్ ఫిల్మ్ థియేటర్లలో ఆడియన్స్ నవ్వించింది. కమెడియన్ సప్తగిరి హీరోగా మెప్పించే ప్రయత్నం చేశాడు.

పెళ్లి కాని ప్రసాద్ మూవీ థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీ...