భారతదేశం, డిసెంబర్ 9 -- చిత్తూరు జిల్లా నగరి మండలంలో మంగళవారం ఉదయం రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తాడుకుపేట సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఒక వాహనం తిరుచానూరు నుండి తిరుత్తణికి వెళుతుంది. మరొకటి చెన్నై నుండి తిరుమలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు తిరుచానూరుకు చెందిన శంకర్, సంతానం, చెన్నైకి చెందిన అరుణ్‌గా గుర్తించారు.

తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో శంకర్, సంతానం పోటు(వంటగది) కార్మికులుగా పనిచేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. గాయపడిన ముగ్గురు వ్యక్తులు తమిళనాడుకు చెందినవారని తెలిసింది. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం నగరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రు ఏటిగట్టు మలుపు వద్ద పాఠశాల బస...