భారతదేశం, మే 3 -- తెలుగు హార‌ర్ కామెడీ మూవీ టుక్ టుక్ ఓటీటీలో అద‌ర‌గొడుతోంది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ రెండు ఓటీటీల‌లో ట్రెండింగ్ ఉంటుంది. టాన్ టెన్ మూవీస్‌లో ఒక‌టిగా కొన‌సాగుతోంది. అమెజాన్ ప్రైమ్‌ లో టుక్ టుక్ మూవీ యాభై మిలియ‌న్ల‌కుపైగా స్ట్రీమింగ్ మిన‌ట్ వ్యూస్‌ను ద‌క్కించుకొని రికార్డ్‌ను క్రియేట్ చేసింది. రీసెంట్ టైమ్‌లో ఓటీటీలో హ‌య్యెస్ట్ వ్యూస్‌ను ద‌క్కించుకున్నచిన్న సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.

ఈ హార‌ర్ కామెడీ మూవీలో కోర్ట్ ఫేమ్ హ‌ర్ష్ రోష‌న్‌, కార్తీకేయ దేవ్‌, స్టీవెన్ మ‌ధు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. శాన్వీ మేఘ‌న, నిహాల్ కోదాటి హీరోహీరోయిన్లుగా క‌నిపించారు. సుప్రీత్ సీ కృష్ణ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ ఏడాది మార్చిలో టుక్ టుక్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. హార‌ర్ ఎలిమెంట్స్‌కు ...