భారతదేశం, మే 20 -- తమిళ నటుడు పేమ్‍గి అమరన్ ప్రధాన పాత్ర పోషించిన వల్లమై సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ థ్రిల్లర్ చిత్రానికి కరుప్పయా మురుగన్ దర్శకత్వం వహించారు. థియేట్రికల్ రన్‍లో నెగెటివ్ టాక్ దక్కించుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ వల్లమై (Vallamai) సినిమా ఇప్పుడు రెండు ఓటీటీల్లోకి రానుంది.

వల్లమై సినిమా మే 23వ తేదీన ఆహా తమిళ్, టెంట్‍కొట్ట ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రం స్ట్రీమింగ్‍పై ఆహా తమిళ్ నేడు (మే 20) అధికారికంగా ప్రకటించింది. "జీవితాలు పూర్తిగా మారిపోయాయి. మే 23న వల్లమై చిత్రం ఆహా తమిళ్‍లో ప్రీమియర్ అవుతుంది" అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆహా తమిళ్.

వల్లమై సినిమాను రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంగా డైరెక్టర్ మురుగన్ తెరకెక్కించారు. కూతురిపై అఘాయిత్యం చేసిన...