Hyderabad, జూన్ 9 -- టాలీవుడ్‌లో వర్సటైల్ స్టోరీలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో నవీన్ చంద్ర. థియేట్రికల్ సినిమాల్లో నటుడిగా, విలన్‌గా మెప్పించిన నవీన్ చంద్ర ఓటీటీ మూవీస్‌తో సూపర్ క్రేజ్ అందుకున్నాడు. డిఫరెంట్ థ్రిల్లింగ్ జోనర్స్‌తో తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ సాధించుకున్నాడు నవీన్ చంద్ర.

అలాంటి హీరో నవీన్ చంద్ర పోలీస్ ఆఫీసర్‌గా నటించిన రీసెంట్ తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ లెవెన్. తెలుగు, తమిళంలో బైలింగువల్ సినిమాగా వచ్చిన లెవెన్ సినిమాకు తమిళ పాపులర్ డైరెక్టర్ సుందర్ సి వద్ద అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసిన లోకేష్ అజిల్స్ దర్శకత్వం వహించారు.

ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించిన లెవెన్ సినిమాలో నవీన్ చంద్రతోపాటు రేయా, అభిరామి, దిలిపన్, రిత్విక, ఆడుకాలం నరేన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పో...