భారతదేశం, ఆగస్టు 30 -- ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్​ఐఏసీఎల్​)లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఓ) పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 30, 2025తో ముగియనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎన్​ఐఏసీఎల్​ అధికారిక వెబ్‌సైట్ newindia.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్​ చేసుకోవడానికి చివరి తేదీ దగ్గర పడింది కాబట్టి, అర్హులైన అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవడం మంచిది.

ఈ పోస్టులకు మొదటి దశ (ఫేస్​ 1) ఆన్‌లైన్ పరీక్ష సెప్టెంబర్ 14న, రెండో దశ (ఫేస్​ 2) ఆన్‌లైన్ పరీక్ష అక్టోబర్ 29, 2025న జరుగుతాయి.

రిజిస్ట్రేషన్​ చేసుకోవడానికి, ముందుగా "Click here for New Registration" అనే టాబ్‌ను ఎంచుకుని, మీ పేరు, కాంటాక్ట్ వివరాలు, ఈ-మెయిల్ ఐడీ నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, సిస్టమ్ ద్వారా ఒక ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నంబ...